◆అక్రమార్కులకు అండగా దేవాదాయశాఖ అధికారులు
State Politics News(Nellore):
నెల్లూరు నగరం లో నవాబుపేట రెండవ పోలీస్ స్టేషన్ ( నవాబుపేట్ పోలీస్ స్టేషన్) ఎదురుగా శ్రీ చీదేళ్ల వారి సత్రం ఉంది. ఆ సత్రంనకు చెందిన వారసుడు నంబూరు .సంతోష్ బాబు ప్రెస్ క్లబ్ లో మంగళవారం మే 24 న ప్రెస్ మీట్ ద్వారా ఆ సత్రానికి చెందిన అనేక అక్రమాలను,నిర్లక్ష్యాలను ప్రజలకు,అధికారులకు తెలిపారు.
★అక్రమం 1:శ్రీ చీదేళ్ల వారి సత్రం సర్వే నెంబర్ 171,నెల్లూరు బిట్ 2 లో 3 ఎకరాల 63 సెంట్లు భూమిని కలిగి ఉంది.
ఆ సత్రం నిర్వహణ దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు.ఆ స్థలంలో 60 కి పైగా గృహాలకు
ఇంటి పన్నులు సత్రం పేరుతో ఇవ్వడం లేదు.
★అక్రమం 2 : ఆ సత్రం భూమి లో ఉన్న షుమారు 60 గృహాలకు కరంట్ బిల్లులు సత్రం పేరుతో ఇవ్వడం
లేదు.
★అక్రమం 3: ఆ సత్రం ఉద్దేశ్యం ప్రతి ద్వాదశికి బ్రాహ్మణులకు
భోజనం పెట్టాలి కానీ పెట్టడం లేదు.
★అక్రమం 4 : ఆ సత్రం వాకిట్లో స్థానిక రెండవ పట్టణ పోలీసు
వారు పాత మోటారు బైక్ లు అడ్డం పెట్టి ఉన్నారు.
ఈ సత్రం ఆస్తి 200 కోట్లు కు పైగా ఉన్నప్పటికీ ఈ విధమైన దయనీయ పరిస్థితుల్లో సత్రం ఉండడం, సత్రం వారసుడిగా బాధపడుతున్నాను.దాత కోరిక మేరకు దేవాదాయశాఖ వారు చర్యలు తీసుకుని
సత్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం పై అధికారులకు ఫిర్యాదు లు చేసినప్పటికీ చర్యలు లేనందున ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చినదని ఆవేదన వ్యక్తం చేశారు.మీడియా ద్వారా అయినా న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ,దేవాదాయ శాఖ,విద్యుత్ శాఖ, పోలీసు శాఖకు అర్జీ లు ఇచ్చినప్పటికీ స్పందన కరువైందన్నారు.
ఈ సత్రం పూర్తిగా కూలిపోయి ఉన్నప్పటికీ రేకులు కూడా వేసుకోలేని పరిస్థితి లో దేవాదాయశాఖ ఉందని,సత్రానికి కోటి రూపాయల కు పైగా నగదు కూడా ఉందన్నారు.ఆ డబ్బులతో అయినా రేకులు లేదా స్లాబ్ వేసుకోవచ్చు అని సూచించారు.