State Politics News(Sarvepalli):
నరుకూరు గ్రామాలలోని సమస్యలను ఆయా గ్రామాలలోనే పరిష్కరించుకునేందుకు సచివాలయ వ్యవస్థ నాంది పలికిందని, గ్రామ అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక చిరునామా గ్రామ సచివాలయమని
రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు .
శనివారం 40 లక్షల రూపాయల ఖర్చు తో నిర్మించిన టిపి గూడూరు మండలం నరుకూరు గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మరేతర రాష్ట్రాల్లో అమలులో లేవన్నారు. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమని తెలిపారు. గత ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లకు సంవత్సరానికి కేవలం 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుందన్నారు. సమాజంలోని అన్ని అట్టడుగు వర్గాలను ఆర్ధికంగా ఆదుకుని పైకి తెచ్చేందుకు కృషి చేయడమే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలవారికి కూడా ఈ బి సి నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, ఇంకా మెరుగైన పరిపాలనకు సలహాలు, సూచనలు కోరుతూ "గడప గడపకూ మన ప్రభుత్వం" అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ లబ్ధి పొందని ఇల్లంటూ లేదని, కాబట్టే ఎక్కడికెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు.
ఈ కార్యక్రమం లో నెల్లూరు ఆర్డీవో కొండయ్య, టిపి గూడూరు ఎంపీడీవో హేమలత, నరుకూరు గ్రామ సర్పంచ్ శారద, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత తదితరులు పాల్గోన్నారు.