గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో కాకాని కి అపూర్వ స్వాగతం

 



State Politics News (Sarvepalli):

 సర్వేపల్లి  నియోజకవర్గ పరిధిలోని, పొదలకూరు మండలం, విరువూరు  గ్రామంలోని  గిరిజన కాలనీలో జరుగుతున్న  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్ర‌జ‌లు  అపూర్వ  స్వాగతం పలికారు.

ఆదివారం విరువూరు గ్రామ పరిధిలోని గిరిజన కాలనీలో  "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు
పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు మంత్రికి సాదర స్వాగతం పలికారు.




మంత్రి  గోవర్ధన్ రెడ్డి,  ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సేవలు, సంక్షేమ ఫలాలను తెలుసుకుంటూ, ఏమైన సమస్యలు వుంటే తమ దృష్టికి తేవాలని అన్నారు. ప్రతి  కుటుంబాన్ని కలుసుకోవడంతో పాటు   ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న మోహన్ రెడ్డి సంతకం చేసిన ఉత్తరాన్ని, బుక్ లెట్‌ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.