State Politics News(Nellore)
నగరంలోని ప్రధాన మార్గాలతో పాటు చిన్నపాటి వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నగర వాతావరణంపై సిబ్బంది అంతా దృష్టి సారించాలని నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి సూచించారు. స్థానిక చిన్న బజారు, పెద్ద బజారు, స్టోన్ హౌస్ పేట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని వీధుల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అపరిశుభ్రంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో వెంటనే మెరుగైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని, అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులను చేపట్టాలని కమిషనర్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయం కార్యదర్శులు, పారిశుధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.