State Politics News(Nellore):
నెల్లూర్ లో గత8 సంవత్సరాలుగా ఇంటివద్దకే వైద్య సేవలందిస్తూ.. భారతి హోమ్ కేర్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రజలుచే అభినందనలు పొందుతున్నదని ఆ సంస్థ అధినేత జి పవన్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా www.bharathi homecare and health services.com అనే వెబ్ సైట్ ని కూడా నెల్లూరు నగరంలోని తడికల బజార్ సెంటర్ వద్ద నున్న తన కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్ లు జి.పునీత్ శివ సాయి,జి రేవంత్ శివ సాయిలు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.నెల్లూర్ జిల్లా లోని సుదూర ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా తమసేవలు అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు. జిల్లా ప్రజలందరూ మా వెబ్ సైట్ ని సందర్శించి మా హోమ్ కేర్ అండ్ హెల్త్ సర్వీసెస్ సేవలను సద్వినియోగం చేసుకొని,ప్రాణాపాయ స్థితి నుండి ఆరోగ్య స్థితిలోకి మారేందుకు,తమ సహాయ సహకారాలును ప్రజలు అందిపుచ్చుకోగలరని అన్నారు.ముఖ్యంగా విదేశాలలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు తమ తల్లిదండ్రులు నెల్లూరు జిల్లాలో ఉంటారని వారికి వైద్య సేవల కోసం తమ భారతి హోమ్ కేర్ అండ్ హెల్త్ సర్వీసెస్ 24గంటలు అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని సంస్థఅధినేత పవన్ కుమార్ కోరారు.ఈ కార్యక్రమంలో భారతి హోమ్ కేర్ సిబ్బంది స్టాఫ్ నర్స్ పి. భారతి, ఈ యం టి ఏ లు ప్రతాప్, గోపి కృష్ణ, నాగరాజు,ల్యాబ్ టెక్నీషియన్ శివ, అంబులెన్స్ డ్రైవర్ సందీప్,నర్సులు రమాదేవి,గీత,వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.