State Politics News(Nellore)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ గృహ యోజన పధకంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థలో లబ్ధిదారులకు అందించనున్న టిడ్కో గృహ సముదాయాల్లో ప్రస్తుత అభివృద్ధి వివరాలను కమిషనర్ జాహ్నవి సమీక్షించారు. కార్పొరేషన్ హౌసింగ్ విభాగం, మెప్మా సిబ్బందితో కార్యాలయంలోని కమిషనర్ విభాగంలో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ టిడ్కో గృహాల పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు రుణాలు మంజూరు చేసి లబ్ధిదారులకు త్వరితగతిన గృహాలను మంజూరు చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను నిర్ధారించుకుని గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా పర్యవేక్షించాలని, అర్హులైన వారందరికీ టిడ్కో గృహాలను స్వంతం చేసేందుకు అధికారులంతా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ వై.ఓ.నందన్, మెప్మా పి.డి రవీంద్ర, టిడ్కో ఈ.ఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు.