State Politics News(Nellore)
2022-23 ఆర్ధిక సంవత్సరానికి నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్థి పన్నులను ఈ నెల 30వ తేదీ లోపు చెల్లించిన వారికి మొత్తం పన్నులో 5 శాతం రాయితీ కల్పిస్తామని కమిషనర్ జాహ్నవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్థి పన్ను బకాయిలు ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం కల్పించిన లాభసాటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏప్రిల్ నెల 30 వ తేదీ లోపు పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా ఏర్పాటు చేసి వున్న రెవెన్యూ కలెక్షన్ కేంద్రాలలో ప్రజలు సులభ రీతిలో పన్నులు చెల్లించే వసతులు కల్పించామని కమిషనర్ తెలిపారు. అన్ని ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో సైతం కేంద్రాలు పనిచేస్తాయని, ఆన్లైన్ చెల్లింపుల కోసం " ఎన్.ఎమ్.సి ఫర్ యు" యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషనర్ వెల్లడించారు.