State Politics News(Amaravathi)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి తన వ్యవసాయ శాఖకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులతో విజయవాడలోని తన నివాసంలో సమావేశమయ్యారు. శాఖలో అమలవుతున్న అనేక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ పట్ల పూర్తిస్థాయి సమీక్షలు త్వరలోనే నిర్వహిస్తామని తెలియజేశారు.
తాను మంత్రి కావడానికి కారకులైన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసారు.