State Politics News (Nellore)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో ఇటీవల ఆలపాక కిషోర్ కల్లుగీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడి నడుము పక్క ఎముకలు మూడు ఫ్యాక్చర్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం & నెల్లూరు జిల్లా గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కోసూరు గోవిందయ్య గౌడ్ సూచనమేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరు రాజశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో అధ్యక్షులు తోట ప్రభాకర్ గౌడ్ ,సభ్యులు
కిషోర్ ను పరామర్శించి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గౌడ్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నలుమూలల గౌడ్ కుల వృత్తి చేసుకుంటూ చెట్టుపై నుంచి ప్రమాదం జరిగి వికలాంగులైన వారికి పదివేల రూపాయలు అదే విధముగా మరణించిన వారికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.
గౌడ విద్యార్థులు ఉన్నత విద్య చదివే విధంగా ప్రోత్సహించేందుకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి 8.5 ఆపై గ్రేడ్ లో ఉత్తీర్ణులైన గౌడ విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయలు నగదు బహుమతి ప్రశంసా పత్రం, మెమెంటో, నోట్ బుక్స్, పెన్స్, క్యాలిక్యులేటర్ ప్రతి సంవత్సరం అందివ్వడం జరుగుతుందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు కోసూరు గోవింద గౌడ్ పై కార్యక్రమాలు ఎప్పుడూ జరిగే విధంగా ఒక కోటి రూపాయలు ట్రస్ట్ కి విరాళంగా అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉప్పాల రామకృష్ణ గౌడ్, యువత అధ్యక్షులు జడపల్లి దయాకర్ గౌడ్, యువత గౌరవ అధ్యక్షులు తాళ్ల రాజా గౌడ్, దాసరి హజరత్ గౌడ్, కోసురు చిన్న గోవింద్ గౌడ్, దాసరి హరికృష్ణ గౌడ్, బండ్ల బాబు గౌడ్, తిరకాల మధుసూదన్ గౌడ్, పర్చూరు దశయ్య గౌడ్, ఉదయగిరి శ్రీనివాసులు గౌడ్, గ్రామ కల్లు సొసైటీ ప్రెసిడెంట్ చందా నాగరాజు మరియు గ్రామ కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు.