State politics news(Nellore)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందజేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్పందన వేదికను కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రధానంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంభందించి 15 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వై.ఓ.నందన్, ఎస్.ఈ సంపత్ కుమార్, మేనేజర్ రాజేంద్రప్రసాద్, నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.