ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చుతున్న కార్పొరేటర్ పడిగినేటి

 


State Politics News(Nellore Rural):

   ఎన్నికలప్పుడు సాధారణంగా ప్రజలను మభ్యపెడుతుంటారు రాజకీయనాయకులు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం తమకే ఓటు వేసి గెలిపించాలని ఊదర గొట్టుతుంటారు నాయకులు.అయితే అందుకు భిన్నంగా ఆ డివిజన్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేసిన వాగ్దానాలను సైతం ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నారు 2వ డివిజన్ కార్పొరేటర్ అయిన పడిగినేటి రామ్మోహన్ యాదవ్. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన పడిగినేటి, తాను ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను తూచ తప్పకుండా నెరవేర్చుతూ...రాజకీయాల్లోకి సేవ చేసేందుకే వచ్చానని, ప్రజలకు అందుబాటులో ఉండే


నాయకుడిగా మరింతగా ముందుకు దూసుకువెల్లుతున్నారు. తమ డివిజన్ పరిధిలో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడటమే తన ముందున్న బాధ్యత గా కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ పని చేస్తున్నారు.అయితే  గుడిపల్లిపాడులోని బిసి కాలనిలో శ్రీ సీతారాముల వారి దేవస్థానం ప్రహరీ గోడ నిర్మాణానికి 4లక్షలు,అలాగే అరుంధతి వాడలో ఉన్న చర్చి ప్రహరీ గోడ మరియు గేట్ల నిర్మాణం కు 2లక్షలు, శ్రీ మాతమ్మ గుడి మరమ్మత్తులు, ప్రహరీ గోడ నిర్మాణం కు 5లక్షలు అంతేకాకుండా మరి కొన్ని ప్రాంతాల్లో సుమారు 18 లక్షల వరకు దేవాలయాల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగిస్తున్నారు. డివిజన్ అభివృద్దే తన లక్ష్యమని.. కోటంరెడ్డి బ్రదర్స్ సహకారంతో డివిజన్ అభివృద్ధి కి బాటలు వేస్తున్నామని కార్పొరేటర్ రామ్మోహన్ తెలిపారు.