State Politics News (Nellore Rural)
ప్రతి ఒక్కరినీ పారిశ్రామికంగా తీర్చిదిద్దుతామని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి డైరెక్టర్ షేక్ కరిముల్లా పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నారాయణ రెడ్డి పేట ఎం, ఎస్, ఎం ,ఈ, రాష్ట్ర డైరెక్టర్ షేక్ కరిముల్లా వారి క్యాంపు కార్యాలయంలో 1వ డివిజన్ నారాయణరెడ్డి పేట చేనేత దారులు,16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ ప్రాంత వ్యాపారస్తులు, మహిళలు కలిసి డైరెక్టర్ కరిముల్లా ని శాలువాలతో సత్కరించి అభినందలు తెలిపారు .ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు, చిరు వ్యాపారులకు ప్రభుత్వం ప్రతి ఏటా సహాయ సహకారాలు అందిస్తుందని, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఎం ,ఎస్, ఎం, ఈ, ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అందిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.