దశ దిశలా ..కాకాణి

 


State Politics News(Nellore):

★పేరులోనే ఉంది అందరివాడని అతనే గోవర్ధన్ గిరుడు


★కరోన కష్ట కాలంలోనైన..ప్రజలకు ఇబ్బందులేకుండా చూడటమే ఆయన నైజం


★జిల్లాల విభజన లో  నియోజకవర్గ పరిధిని నెల్లూరు లో ఉండేందుకు కృషి


★ప్రజా శ్రేయస్సే  సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని అభిమతం


న్యూస్ ఫోర్స్, సర్వేపల్లి: నెల్లూరు జిల్లాలో ఆ నియోజకవర్గమే ఓ ప్రత్యేకత నెలకొని ఉంది.ఆ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఏ కష్టం ను దరి చేరనీయకుండా తానున్నానని భరోసానిచ్చే నాయకున్నే ఎన్నుకున్నామని ఆ నియోజకవర్గ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఎవరైతే చేరువవ్వుతారో.. వారినే గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు. అలా నియోజకవర్గ ప్రజల గుండెల్లో కాకాని నిలిచారంటే ప్రజారంజిత పాలన చేయబట్టే ఆయనని ప్రజలు అంతలా అభిమానిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.కరోన కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ప్రజల ప్రాణాలను నిలిపేందుకు తాను దగ్గరుండి ఇంటింటికి బియ్యం, కూరగాయలు,వంటనూనె నిత్యావసర సరుకుల అందజేయడమేకాకుండా..వారికి వ్యాక్సినేషన్ లు వేయించడం మాస్క్ లు అందజేత కార్యక్రమాలు మరెన్నో చేపట్టి ప్రజలుచే "శభాష్ కాకాని సర్ "అనిపించుకున్నారు. ఎంత సేవ చేస్తే కాని దొరకని ప్రేమ అభిమానం కాకాని గోవర్ధన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అభిమానిస్తూ... కొందరి ఇండ్లలో ఆయన్ను ఆరాధిస్తున్నారంటే కరోన కష్ట కాలంలో కాకాని సేవలు మరువలేనిదని ఆ నియోజకవర్గ ప్రజలను ఎవరిని కదిలించిన చెప్పే మొదటి మాట.. "మా పాలిట దేవుడు "అనే చెబుతారు...ఇది ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పైనున్న ఆత్మీయత అభిమాన ప్రేమలు.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధి శ్రీబాలాజి జిల్లాలో కలవనీయకుండా ..ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నెల్లూరు జిల్లాలోనే...సర్వేపల్లి నియోజకవర్గం ఉండేలా జీవో ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తిల వలన కాకాని కృషి ప్రజలకు ఓ వరంలా మారిందని నియోజకవర్గ ప్రజలే బహిరంగంగా చెబుతున్నారు. అయితే స్కూల్ విద్యార్థులకైతేనేమి... వృద్ధులు,వితంతువులు,అలాగే గ్రామగ్రామాన ,వాడవాడల్లో పచ్చదనం,పరిశుభ్రత తదితర వినూత్న కార్యక్రమాలు చేపట్టి నెల్లూరు జిల్లాలోనే కాక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో సర్వేపల్లి నియోజకవర్గం పేరు మారు మ్రోగుతోందంటే ఎమ్మెల్యే కాకాని గోవర్ధన రెడ్డి ప్రజలకు చేస్తున్న సేవలే నిదర్సనంగా మారింది.తెలుగు రాష్ట్రాలలో కూడా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని పేరు తలుచుకోవడం గమనార్హం.