State Politics News(Nellore):
★సంబరాలు జరిపిన నెల్లూరు బీజేపీ
బీజేపీ ఉత్తర ప్రదేశ్ లో రెండోవ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాధ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ దాసరి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. నెల్లూరు నగరం ఫత్తేఖాన్ పేట లోని నీలగిరి సంఘం మండల బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు ఆనందోత్సాహాలతో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గొప్ప నిర్ణయాలు, అభివృద్ధి పనులు చేయబట్టే రెండోసారి కూడా యూపీ ప్రజలు బీజేపీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నేతలు చిలక ప్రవీణ్, బి రఘురామయ్యా, అనురాధ,నారాయణరావు, బాలాజీ, చక్రి తదితరులు పాల్గొన్నారు.