State Politics News(Nellore):
నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రయాణికుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి గాయపడిన వారిని మెరుగైన వైద్యం చేయుటకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు టౌన్ వెంకట్రావుపల్లి నివాసి గడ్డం వేనమ్మ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున 5 లక్షలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేయడం జరుగుతుందని, అలాగే వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.