మహిళలు మహారాణులు కావాలి

 



State Politics News(Guntur)

మహిళలు మహారాణులుగా సమాజంలో సగర్వంగా తలెత్తి బ్రతకాలని తెలుగు సంస్కృత  అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్-శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు సెంటె ఎయిన్స్ మహిళా కాలేజ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ సేవకులకు "లేడీ లెజెండ్ ఇన్స్పిరేషన్ అవార్డు " ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.  ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్  నాయుడు మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ఏమాత్రం తీసిపోని విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో అవార్డు గ్రహీతలు డాక్టర్ సిస్టర్ టి.ఫాతిమా రాణి, ఈద నిర్మల, డాక్టర్ టి.నిర్మలా మేరీ, డాక్టర్ బి.శోభారాణి, సరస్వతి పద్మజ, ఎస్.ఎ.జోస్పిన్, బెజవాడ మనోరమ లను అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న లక్ష్మి చారిటబుల్ ఫౌండేషన్ అధినేత గడ్డం ప్రసన్న లక్ష్మి, కె.మురళీమోహన్ రాజు, జాన్, షేక్ కాలేషా,చంద్ర, విద్యార్థులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.