ఆర్టీసీ కాంప్లెక్స్ షాపుల గోల్ మాల్ లు

 


State Politics News(Nellore)

★టెర్మినేట్ చేసిన షాప్ యజమాని కి మరల షాప్ అప్పగిస్తారా..!?


★ఆర్టీసీ నియమ నిబంధనలు ప్రకారం షరతులును నీరుగార్చుతున్నా నెల్లూరు అధికారులు


★ఆమ్యామ్యాలతో తలొగ్గేరా..?


★షాప్ మధ్య చిచ్చులు.. ఆవేదనలో కొందరు షాప్ యజమానులు


★అధికారులు మీనమేషాలు.. ఉన్నతాధికారి దృష్టి సారించేనా..!?


★ఆర్టీసీ నిబంధనలు అమలు పరిచేనా..!?


న్యూస్ ఫోర్స్ ప్రత్యేక కథనం....

 నెల్లూరు లో ఆర్టీసీ కాంప్లెక్స్ లో షాప్ లలో కొందరి అధికారులు చేతివాటంతో గోల్మాల్ జరుగుతున్నాయి. ఆర్టీసీ లో షాప్ కావాలంటే టెండర్ ద్వారా షాప్ ని దక్కించుకోవడం జరుగుతుంది. అలాకాకుండా నేరుగా షాప్ పొందటానికి అసలు వీలు ఉండదు. ఆర్టీసీ కార్మికులు.. కానీ ,ఆర్టీసీ అధికారులు ఎవరైనా రిటైర్ అయ్యుండి వారికి కావాలనుకుంటే దానిని ఉన్నతాధికారులు పరిశీలించి వారికి మాత్రమే నేరుగా షాప్ ఇచ్చే అవకాశం కూడా చాలా అరుదు. అయితే టెండర్ ద్వారా ఎవరైనా షాప్ పొందిన వారు ప్రక్కనే ఉన్న షాప్ యజమానులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అంతేకాకుండా షాప్ వద్ద ఒకరినొకరు దూషించుకున్న అటువంటి వారిపై అధికారులు ఎంక్వైరీ వేసి నిజ నిజాలు తెలుసుకుని తప్పుచేసిన వారిపై చర్య తీసుకుంటారు.. అలా చర్యలు తీసుకున్న వ్యక్తిపై ..సదరు షాప్ దారుడు కి నోటీసు లు.అందజేస్తారు.పలు పర్యాయాలు నోటీసులు ఇచ్చిన మారని షాప్ దారుణ్ణి అధికారులు తక్షణమే అక్కడ నుండి టెర్మినేట్ చేసి మరెక్కడా అతను ఆర్టీసీ షాప్ లకు టెండరు వేయకుండా రెడ్ మార్క్ లో పెట్టడం జరుగుతుంది. అయితే ఇదంతా సక్రమంగా జరిగితే పర్వాలేదు... కొందరి అధికారులు చేతివాటమో కానీ ఇంతలా రిస్క్ ఉన్న షాప్ దారులకు కొందరికి మరల టెర్మినేట్ నోటీస్ నుండి మరల షాప్ అతనికి ఇచ్చి నడుపుకునేల జిల్లాలో కొన్ని చోట్ల జరుగుతున్నాయాయని "న్యూస్ ఫోర్స్ టీం "పరిశీలన లో బయట పడ్డాయి.దీనివలన ప్రక్క షాప్ దారులు అతని వలన ఎంత మానసిక వేదన వ్యాపారాలు దెబ్బతిన్న వి అన్ని యూ ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అయితే అలాంటి వారికి న్యాయం చేస్తారా.... లేక రిస్క్ చేసి మరీ ప్రక్క షొప్ వ్యక్తులను ఇబ్బందిపెట్టే వారికి మరల షాప్ అప్పగించి ఆర్టీసీ నియమ నిబంధనలను త్రుంగలో తొక్కతారో ...కొద్ధి రోజుల్లో ఉన్నతాధికారులు తీసుకునే చర్యలే స్పష్టం చేస్తాయి.