ప్రభుత్వం ,అధికారుల నిర్లక్ష్యం తో కనిగిరి రిజర్వాయర్ అక్రమార్కులకు అడ్డగా మారుతుంది : నెల్లూరు ప్రభాకర్ రెడ్డి
State Politics News(Buchhi reddy palem):
బుచ్చిరెడ్డిపాలెం స్థానిక టిడిపి కార్యాలయంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి ఓ రైతు సదస్సులో మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో సిబ్బంది కొరత వలన ఏటా కనిగిరి రిజర్వాయర్ కాల్వల నిర్వహణ, నీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రభుత్వాలు అధికారుల నిర్లక్ష్యం తో సరైన పర్యవేక్షణ లేకపోవటంతో నీటినిల్వల పంపిణీ అధ్వానంగా మారాయని ఎద్దేవా చేశారు. అనేక కాల్వలు నిర్వహణ లేక ఆక్రమణ దారుల ఆక్రమానికి గురి అవుతూ కనిగిరి రిజర్వాయర్ రూపురేఖలు మారిపోయాయన్నారు. అందువలన సాగునీటి పంపిణీకి ఇబ్బందిగా మారింది.కనిగిరి రిజర్వాయర్ ఇరిగేషన్ పరిదిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళిగా ఉన్న ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. అధికారులు నిర్లక్ష్యం తో అధికశాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో కాలువల పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారిందంటూ తీవ్రంగా విమర్శించారు.లస్కర్ లేని ఇరిగేషన్ పరిది బుచ్చిరెడ్డి పాళెం లోనే చూస్తున్నామన్నారు.కనిగిరి రిజర్వాయర్ వందల ఎకరాల ఆయకట్టు ఉంది. పంటల సాగుకు కనిగిరి జాలాలు విడుదల సమయంలో సిబ్బంది కొరత వలన పర్యవేక్షణ లేక నీరు దుర్వినియోగం అవుతుందన్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు అధికనీరు వాడుకుంటున్నారు. దీనివలన చివరి ఆయకట్టు భూముల రైతులకు నీరు అందక పంటలు సాగుచేసుకోలేకపోతున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే అన్నీ ప్రాంతాలకు వాటా ప్రకారం సాగునీరు పంపిణీ చేసే వీలుకలుగుతుందని ఆయన సూచించారు.ఈ లోపు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి అన్నీ ప్రాంతాలకు నీరు సక్రమంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.