బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి : కమిషనర్ దినేష్ కుమార్

 




State Politics News(Nellore):

నెల్లూరు నగర పాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా కమిషనర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనల సమీక్షపై కమిషనర్ చాంబర్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా ఆదాయ వ్యయాలను ప్రణాళికాబద్ధంగా అంచనా వేసుకొని నగర అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ లోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.