వరదల అంచనా సవాళ్లకు నివారణ చర్యలు ఏమిటి? లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ ఆదాల

 


State Politics News(NELLORE/NEW DELHI):

 ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో సంభవించే వరదల అంచనాల్లో ఎదురవుతున్న సవాళ్లకు ఏ విధమైన నివారణ చర్యలు తీసుకుంటున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాతపూర్వకంగా సమాధానమిస్తూ అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నదులపై వరద అంచనాను కేంద్ర జల సంఘం ఒక ప్రాతిపదికను రూపొందించిందని తెలిపారు. ఐదురోజుల వరదలను ఈ పద్ధతులు ఉపయోగించి స్వల్ప శ్రేణి అంచనా, గణిత నమూనాలను ఉపయోగించి ఒక ప్రాతిపదికను రూపొందించిందని పేర్కొన్నారు. రాబోయే వరదల ఖచ్చితత్వం ముందుగానే అంచనా వేయడానికి ప్రయత్నిస్తోందని, అయినప్పటికీ వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా అధిక తీవ్రతతో కూడిన వర్షం పెరుగుతున్న సంఘటనలు వరద అంచనాకు మరో సవాలు గా మారాయని తెలిపారు. అయినప్పటికీ స్పేస్ టెక్నాలజీ టూల్స్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం, వెబ్ ఆధారిత అప్లికేషన్లు ఐ.టి తో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వరద అంచనాను  తెలుసుకునేందుకు నిరంతర ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. నదుల ఒడ్డున ఉన్న గ్రామాలు, పట్టణాల్లో 199 స్థాయి సూచన, ప్రవాహ సూచన కేంద్రాలు ఏర్పాటు చేసి 23 రాష్ట్రాలు, 20 నదులలోని పరిస్థితులను అంచనా వేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలకు వరద అంచనాను 5 రోజుల ముందుగానే జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని, దీని కోసం ప్రత్యేక వెబ్ సైట్ను ఆధునీకరించారని, రోజువారీ వరద పరిస్థితుల నివేదిక సోషల్ మీడియా వేదికగా ప్రజలతో భాగస్వామ్యం చేయబడుతుందని తెలిపారు. నేపాల్, భూటాన్, చైనాలతో ఈ సమాచారాన్ని పంచుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాల కూడా జరిగాయని పేర్కొన్నారు.