సామాజిక హితం కోరేది సాహిత్యం!

 



State Politics News(Nellore):

సామాజిక హితం కోరుకునేది నిజమైన సాహిత్యమని ఎ.పి.జెన్కో డి.ఎస్.పి. కొల్లూరు శ్రీనివాసరావు, నెల్లూరు ట్రాఫిక్ డి.ఎస్.పి. ఎమ్.డి.అబ్దుల్ సుభాన్ లు పేర్కొన్నారు.

పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నెల్లూరు ఆదిత్య నగర్ లోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు రచయిత పంచాగ్నుల విశ్వేశ్వర శర్మ స్మారకార్ధం సాహిత్య- సేవా రంగాలలో కృషి చేసిన ప్రముఖులకు పురస్కారాల ప్రాదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సేవా రంగంలో కృషి చేసిన ఎమ్.డి.జాకీర్(నెల్లూరు), ఎ. అరుంధతి(కోవూరు) మరియు సాహిత్య రంగంలో కృషి చేసిన తోట సులోచన(నెల్లూరు), అలంకారం విజయకుమార్ రాజు(కందుకూరు), పట్టేం వేణుగోపాల్(నాయుడుపేట) లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేర్నపాటి శ్రీరామరాజు, మురళీమోహన్ రాజు, టి.వెంకటేశ్వర్లు, గంటా రవి కుమార్, అలహరి వెంకటేష్, ప్రిన్సిపాల్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.