యువతతోనే దేశాభివృద్ధి సాధ్యం:డిపిఓ ధనలక్ష్మి

 



 State Politics News(Nellore)

యువతలోని శక్తి యుక్తులను, నైపుణ్యాలను వెలికితీసి వారిని జాతి నిర్మాణంలో పాలుపంచుకునే విధంగా తీర్చిదిద్దడం నైబర్ హుడ్ పార్లమెంట్ ముఖ్య ఉద్దేశమని జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్ర సహకారంతో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని రావూస్ డిగ్రీ కాలేజ్ నందు జాతీయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యువత అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటినుండే నాయకత్వ లక్షణాలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ ట్రాఫిక్ డి.ఎస్.పి. అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ యువజన సంఘాల బలోపేతానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొనుటకు వివిధ సంక్షేమ, అభివృద్ధి పధకాల సహకారంతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం కళాశాలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. రామారావు, నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్రరెడ్డి, ప్రిన్సిపాల్ షరీఫ్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు, మోటివేటర్ టి.వెంకటేశ్వర్లు, 440 మంది విద్యార్థులు పాల్గొన్నారు.