State Politics News(Nellore)
భద్రత అనేది బాలికలకు కనీస హక్కుగా గుర్తించుకోవాలని నవాబుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.వి.సుబ్బారావు పేర్కొన్నారు. శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు నవాబుపేట లోని బి.వి.ఎస్. బాలికల ఉన్నత పాఠశాల నందు "బాలికల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై ఉద్దేశ పూర్వకంగా ఎదుటి వాళ్లు ఏ పొరపాటు చేసిన వెంటనే తల్లిదండ్రుల దృష్టికి లేదా పోలీసుల దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మురళీమోహన్ రాజు మాట్లాడుతూ సమస్య వచ్చినప్పుడు దాచుకోకుండా దాని నుండి ఎలా బయటపడాలో ఆలోచించుకుని, చదువు మీద దృష్టి పెట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ జ్యోతి, మోటివేటర్ టి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.