State Politics News(Nellore):
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సమ్మిళిత విద్య ను సమగ్ర శిక్ష శాఖ ద్వారా భవిత సెంటర్ నుండి యన్ జి ఓ ల సాకారం తో దివ్యాoగులకు చదువు, భోజన వసతి సదుపాయాలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కో ప్రాజెక్టు డైరెక్టర్ సి హెచ్ ఉషారాణి తెలిపారు. సమగ్ర శిక్ష కార్యాలయంలోని ఆమె ఛాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపీడీ మాట్లాడుతూ.. జిల్లాలో 3,846 మంది విద్యార్థులు ను అన్ని విధాలుగా చదివిస్తున్నామని, భవిత సెంటర్ 747 ,హోమ్ 340మంది విద్యార్థులు, వారందరికి 60 మంది పనిచేస్తున్నారు.అలాగే 14 మంది ఫిజియో థెరపిస్టు లు వారం లో 4 రోజులు వారికి వైద్య పరంగా సేవలందిస్తున్నారని ఆమె తెలిపారు.