State Politics News(Nellore):
నగరపాలక సంస్థ పరిధిలోని 19 వ డివిజన్ రామలింగాపురం , ముత్యాలపాళేo లో పారిశుధ్య పనులను నగర మేయర్ పోట్లురి.స్రవంతిజయవర్ధన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ పోట్లురి.స్రవంతిజయవర్ధన్ మాట్లాడుతూ రామలింగాపురం, ముత్యాలపాళేo నందు ప్రతి రోజు కాలువల శుభ్రం చేయాలనీ, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, కాలువలు పూడిక తీయాలని అధికారులను నగర మేయర్ ఆదేశించారు.
నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నామని, అందులో భాగంగా 19 వ డివిజన్ కు అవసరమైన చోట్ల పారిశుధ్య సిబ్బందిని, డివిజన్ కు అవసరమైన గార్బేజ్ వాహనాలు, కాంపాక్టర్ ను ఏర్పాటు చేయిస్తామని, మునిసిపల్ పార్క్ నందు చెత్తను తొలగించి, అభివృద్ధి చేయిస్తామని మేయర్ పేర్కొన్నారు.
డివిజన్ నందు దోమల నివారణ కొరకు ప్రతి రోజు ఫాగింగ్ చేయాలనీ మరియు పందుల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 19 వ డివిజన్ కార్పొరేటర్ మారంరెడ్డి. జ్యోతి ప్రియ, అభివృద్ధి కమిటీ చైర్మెన్ మదన్ కుమార్ రెడ్డి, పచ్చా.రవి వైసీపీ ఇన్ చార్జ్, వైసీపీ నాయకులు, ఇంజనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.