State Politics News(Nellore):
నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ B.V.S. గర్ల్స్ మునిసిపల్ హై స్కూల్ నందు 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినులకు సుమారు 150 మందికి నోట్ బుక్స్, ఎగ్జాం ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్ పంపిణీ చేసారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్కూల్ H.M కి,టీచర్స్ కు విద్యార్థినులకు మరియు 7 వ డివిజన్ ప్రజలకు 73 వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి కిన్నెర సాగర్ , వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.