State Politics News(Kakinada):
స్టేట్ పాలిటిక్స్ పత్రిక, ఎస్పీన్యూస్ ఛానల్ క్యాలెండర్ ని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం కాకినాడ నగరంలోని ఆయన నివాసంలో స్టేట్ పాలిటిక్స్ పత్రిక,ఎస్పీన్యూస్ ఛానల్ ప్రతినిధులు ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టారు. ముందుగా ఎమ్మెల్యే ద్వారంపూడిని శాలువా తో సత్కరించారు.అనంతరం ఆయన క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ని క్షుణ్ణంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పత్రిక అభివృద్ధి ఇంచార్జ్ మల్లికార్జున్,కాకినాడ ప్రతినిధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.