ఆపద్బాంధవుడిగా రామ్మోహన్ యాదవ్





State Politics News(Nellore):

నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండోవ డివిజన్ మూడవ మైలు లోని దొడ్ల సుబ్బారెడ్డి నగర్ ప్రాంత నివాసి చిట్టమూరు మోహన్ కు అనారోగ్యంతో షుగర్ వ్యాధితో కుడికాలు డాక్టర్లు తీసివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ వెంటనే వారింటికి వెళ్లి మోహన్ భార్య పిల్లలను ఓదార్చి కంటతడి పెట్టారు. వెంటనే ఆ సమాచారాన్ని కొందరి మిత్రులకు అందించారు.దీనితో స్పందించిన పుచ్చకాయల వేణు యాదవ్ వారి సహకారంతో 20000/_ వేల  రూపాయల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందించి ఆర్ యూత్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల బియ్యం నిత్యావసర సరుకులు ఏర్పాటు చేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఇన్చార్జ్ గిరిధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఇలాంటి వారికి సహాయ సహకారం అందించడంలో తమ ఎమ్మెల్యే ఎప్పుడు ముందుంటారని  కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించి  రామ్మోహన్ యాదవ్ అండగా నిలిచారు.