కార్పొరేషన్ లో రేపు స్పందన రద్దు - కమిషనర్ దినేష్ కుమార్

 





State Politics News(Nellore):

నెల్లూరు నగర పాలక సంస్థ లో ప్రతీ సోమవారం జరిగే స్పందన వేదికను కోవిడ్ మహమ్మారి తీవ్రత దృష్ట్యా రేపు రద్దు చేస్తున్నట్టు కమిషనర్ దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థాయికి రాగానే స్పందన వేదికను పునరుద్ధరణ చేస్తామని అన్నారు.  నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు ఎవరూ సమస్యల పరిష్కారానికి వ్యయప్రయాసలకు ఓర్చి సోమవారం నాడు కార్యాలయానికి రావద్దని కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.