State Politics News(Nellore Rural):
నెల్లూరు రూరల్ M L A కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , రూరల్ M L A కార్యాలయం ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు 2వ డివిజన్ లో ప్రస్తుతం ఇస్తున్న 2250/-పెన్షన్ ను 2500 లెక్కన లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరం కానుకగా లబ్ధిదారులకు 2500 పింఛన్ పెంచి ఇచ్చారని డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మనుబోలు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.