State Politics News(Nellore):
ప్రతి ఒక్కరు చదవడం వ్రాయడం చేసేదిశగా జిల్లా స్థాయిలో ఎఫ్ ఎల్ యన్ 100రోజుల రీడింగ్ కార్యక్రమంని నెల్లూరు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సి హెచ్ ఉషారాణి ప్రారంభించారు. స్థానిక క్రాంతి నగర్ మునిసిపల్ కార్పొరేషన్ స్కూల్లో పిల్లలు బాలవాటిక నుండి8వ తరగతి వరకు మూడు గ్రూపులుగా విభజించి వారు వ్రాసేలా, చదివేలా 14 వారాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి మండలంలో ఎఫ్ ఎల్ యన్ 100 రోజుల రీడింగ్ లాంగ్వేజ్, మేథమేటిక్స్ ల నిర్వహణ యం ఈ ఓ లు చేస్తారని తెలిపారు.ప్రతి వారము మూడు గ్రూపులచే వ్రాయడం, చదివడం పై దృష్టి పెట్టాలన్నారు. జనవరి6నుండి ప్రారంభమై ఏప్రియల్ 30వరకు సాగుతోందన్నారు
ఈ కార్యక్రమంలోసమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సానా, నాగమోహన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.