వి ఆర్ కాలేజిస్ ,స్కూల్స్ ను కాపాడండి --జేసీ కి వినతిపత్రం

 




State Politics News(Nellore):

 విఆర్ కాలేజి, స్కూల్ ని కాపాడాలని వి ఆర్ కాలేజి, స్కూల్ పరిరక్షణ కమిటి స్పెషల్ ఆఫీసర్, జేసీ హరేందిరా ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో ఎయిడెడ్ కాలేజి ల ఏవిధముగా నడుస్తుందో అదేవిధంగా కొనసాగేలా చేసి విద్యార్థుల భవిష్యత్ ని కాపాడాలని వారు కోరారు.100ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న విఆర్ కాలేజ్, స్కూల్  ఎందరినో ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దిన చరిత్ర ఉన్న దానిని నిర్వీర్యం అయ్యేలా ప్రభుత్వంకు అప్పగించే లేఖను వెంటనే వెనక్కి తీసుకుని కాలేజి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ కాలేజ్, స్కూల్ పరిరక్షణ కమిటీ సభ్యులు,పూర్వ విద్యార్థులు మాదాల వెంకటేశ్వర్లు,కటారి అజయ్ కుమార్, మలిరెడ్డి కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.