నగర నడిబొడ్డున విలాసవంతమైన అపార్ట్మెంట్

 





నగర నడిబొడ్డున విలాసవంతమైన అపార్ట్మెంట్

 కు అనుమతులున్నాయా..!?


★అధికారుల అనుమతితోనే ఈ అపార్ట్మెంట్ ఆ సాంతం పెరిగిందా..?


★కమర్షియల్ కాంప్లెక్స్ కి ఎంత విస్తీర్ణం రోడ్డు ఉండాలి..!?


★బిల్డింగ్ నిర్మాణం చుట్టూ ఎంత స్థలం వదిలి రూపుదిద్దుకుంటోంది..!?

★అధికారికంగా ..అనధికారమా..!? అధికారులకు కనపడలేదా..!?

★అధికారులకు కోటి రూపాయలు చేతులు తడిసినట్లు భోగట్టు..!

State Politics News(Nellore):

 నెల్లూరు నగరంలో భారీ కాంప్లెక్స్ లు రూపుదిద్దుకుంటున్నాయి అయితే వీటికి సరైన అనుమతులు ఉన్నాయా ...అసలు నుడా అనుమతులు లేవా..?కార్పొరేషన్ అనుమతులు తోనే ఈ అపార్ట్మెంట్ చెక చెకా.. నిర్మాణాలతో పూర్తి చేసుకుంది. నెల్లూరు నగరం ఇందిరా భవన్ రోడ్డు పాత శ్రీనివాస మహల్ సినిమా హాల్ నేడు భారీ కాంప్లెక్స్ గా రూపాంతరం చెందుతుంది.

అయితే కార్పొరేషన్ అనుమతులుంటే.. నుడా పర్మిషన్ అవసరంలేదా... అసలు రెండు అనుమతులుండాలా.....?ఒకటుంటే సరిపోతుంద అలా కట్టిన అపార్ట్మెంట్ కి అధికారులు అనుమతులు ఇంత పెద్ద కాంప్లెక్స్ నగరంలో రూపురేఖలు దిద్దుకున్న ఆ వైపు త్రోoగిచూసిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే కార్పొరేషన్, నుడా ఖజానా కు అధికారులు గండి కొట్టారనేది.....ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ని చూస్తేనే స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్లాలంటే అధికారులు అడుగులు ముందుకు సాగవా....చిన్న చిన్న వారిపైనా అందులో పేద వారిపైనేనా సిటీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రతాపం అని నెల్లూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.