★మున్సిపాలిటీ స్థలాలు, కాలువలను ఆక్రమించి అక్రమార్కులు షాపులు నిర్మాణాలు చేపట్టి వేలకు వేలు గుంజుడు
State Politics News(NELLORE):
మున్సిపాలిటీ స్థలాలు, కాలువలను ఆక్రమించి అక్రమార్కులు షాపులు నిర్మాణాలు చేపట్టి వేలకు వేలు రూపాయల అద్దెలు గుంజుతున్నారు.
నెల్లూరు నగరం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి,
మద్రాసు బస్టాండ్ సమీపంలోని ఉమామహేశ్వరి దేవస్థానం ఎదురుగా మున్సిపాలిటీ స్థలం ఆక్రమణ గురై కొన్ని ఏళ్లుగా షాపులు నిర్మాణాలు చేపట్టి వేల రూపాయల అద్దెలకు ఇస్తూ లక్షల రూపాయలు ఏడాది కొకసారి గడుస్తున్నారు అక్రమార్కులు.
అయితే వీటిపై మున్సిపల్ అధికారులుపట్టించుకోకపోవడం గమనార్హం. అక్రమార్కుల మంచి ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు స్థానిక ప్రజల నుండి వినిపిస్తున్నాయి. అధికారులు చేతులు తడిపితే చాలు ప్రభుత్వ స్థలాలనైన యథేచ్ఛగా ఆక్రమించేసి సొమ్ము చేసుకోవచ్చు అనే దానికి ఈ ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా మునిసిపల్ కమిషనర్ స్పందించి అక్రమార్కులు ఆట కట్టించి ఆక్రమణలు తొలగించి మునిసిపల్ స్థలాన్ని కాపాడుతారని ప్రజలు కోరుకుంటున్నారు.