ఎమ్మార్వో కు ఇండ్ల స్థలాలపై పోలంరెడ్డి వినతి

 



State Politics News(Nellore):

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్  ఆదేశాల మేరకు నాలుగో డివిజన్ వైయస్సార్ సిపి పార్టీ ఇన్చార్జి పొలం రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి  డివిజన్ ప్రజలకు మొదటి విడతలో ఇంటి స్థలాల కు అర్హులైన వారికి ఇంటి స్థలాలు రాని ప్రజా సమస్యలపై టిడ్కో ఇళ్ల గురించి నెల్లూరు అర్బన్ ఎమ్మార్వో మనోహర్ బాబు కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మార్వో తో మాట్లాడి అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు అందజేయాలని ఆయన కోరారు.