State Politics News(Nellore): అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతామని, నిషేధిత వస్తువులు ఎవరు తీసుకెళ్లిన కఠిన చర్యలు తప్పవని నవాబుపేట్ పోలీసు స్టేషన్ సిఐ సుబ్బారావు తెలిపారు. నవాబుపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు సిఐ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా గంజాయి, బ్రౌన్ షుగర్, హెరాయన్ లాంటి వస్తువులు తరలింపులు ఉన్నాయనే ఉద్దేశ్యం తో వాహనాలను తనిఖీలు చేశారు. యువత ఈ మత్తు పదార్దాలతో జీవితాలను నాశనము చేసుకుంటున్నారని వాటిని అరికట్టే భాగంగా తమ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేయడం జరిగిందని సిఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ వెంట నవాబుపేట్ పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.