కులాల వారీగా జనాభా గణన చేపట్టాలి --బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్

 



State Politics News (Nellore):

మహాత్మా జ్యోతిరావ్ ఫులే వర్ధంతి సందర్భంగా బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో  ఫూలే సెంటర్ వద్ద జ్యోతిరావ్ ఫులే మరియు సావిత్రిభాయి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనగణన  కులాల వారిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. బిసి సాధికారతకు, బిసిల అభివృద్ధికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి కులాల వారీగా జనగణన అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాసిలి సురేష్, అన్నం శ్రీనివాసులు,బచ్చు చిన డేవిడ్,జడపల్లి ప్రసాద్, లాయర్ దాసరి ప్రసాద్,షేక్ సలీమ్,బత్తుల చంద్రశేఖర్, పి.సందాని,అరవ చంద్రశేఖర్,మల్లె ప్రసాద్,కిషోర్ తదితరులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.