State Politics News (Nellore): నెల్లూరు జిల్లాలో నాలుగైదు రోజులుగా భారీ వర్షాల కురుస్తున్న నేపధ్యంలో డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు బాధితులు కు బాసటగా 6వ డివిజన్ ఇంచార్జ్ మద్దినేని శ్రీధర్ నిలిచారు. మంత్రి అనీల్ కుమార్ ,నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకా నాధ్ ల ఆదేశాల మేరకు.. ఆదివారం డివిజన్ లోని ఉడ్ హౌస్ సంఘం లో ఇండ్లలోకి నీరు వెళ్లిన కుటుంబాలను పరామర్శించారు. వారందరికీ భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. డివిజన్ ప్రజలకు కష్టం వస్తే తాను ముందుంటానని వారికి సేవ చెయ్యడమే నా బాధ్యత అని" స్టేట్ పాలిటిక్స్" కి ఇంచార్జ్ శ్రీధర్ తెలిపారు.