State Politics News(Nellore):
ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ యువతలో ఉత్సాహంగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న షేక్ బాబా వసీం హుస్సేన్ ను సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించారు.
నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత కమిటీ లో సోషల్ మీడియా కు ప్రాధాన్యత ఇస్తూ ఆ కమిటీ కి కోఆర్డినేటర్లను నియమించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కమిటీ సభ్యులను ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ యువతలో ఉత్సాహంగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న షేక్ బాబా వసీం హుస్సేన్ ను సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించారు. విద్యావంతుడు వసీం హుస్సేన్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసానడంలో అతిశయోక్తి లేదు. ఎంతో ప్రాచుర్యం పొందుతున్న సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందుంటానని ఈ సందర్భంగా వసీం చెప్పారు .అలాగే తనను నమ్మి ఈ పదవి ఇచ్చి తనపై మరింత బాధ్యతను మోపా రని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకితభావంతో పని చేస్తానని పేర్కొన్నారు. అంతేకాక తనకి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పదవి ఇచ్చేందుకు కృషిచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు లకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.