State Politics News(Nellore):
నెల్లూరు నగరంలోని స్థానిక ఆరవ డివిజన్ వై వి ఎం సి హైస్కూల్ ప్రాంతంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ నూతనంగా 6/3 సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సచివాలయ సిబ్బంది తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగనన్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాలన్నారు.అలాగే అందరిని కలుపుకొని బాగా పనిచేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.
కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు ఆయన చేతులు మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ ఇంచార్జ్ మద్దినేని శ్రీధర్, స్కూలు ప్రధానోపాధ్యాయులు తిరుమల రాజు ,హౌసింగ్ ఏ.ఈ. అహ్మద్ భాషా, 6 వ వార్డ్ ఆర్.ఐ. కృష్ణరావు, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు
సచివాలయ సిబ్బంది,వాలెంటరీలు మరియు తదితరులు పాల్గొన్నారు.