వినాయక చవితి ఇంటికే పరిమితం



State Politics News(Nellore):

కరోన ప్రభావం వినాయక చవితి మీద కూడా పడింది. కరోన వలన పండుగను ఇంటికే పరిమితం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.కరోన ఉదృతం పెరుగుతున్న నేపధ్యంలో వినాయక చవితి పండుగను ప్రజలు తమ ఇంటిలోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాలని నవాబుపేట్ సిఐ టి సుబ్బారావు పేర్కొన్నారు. అలా కాకుండా రోడ్లపై నవాబుపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఏ ఒక్క విగ్రహం పెట్టిన ఉపేక్షించేది లేదని వారిపై కోవిడ్ యాక్ట్ క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినాయక చవితి రోజున దేవాలయాలకు మాత్రమే వెళ్లొచ్చు అని మిగతా ఏ ప్రాంతాల్లో రోడ్లపైన ,వీధుల్లో వినాయక విగ్రహాలు పెడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకాడబోమని, ప్రజల ఆరోగ్యం కోసం కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.