జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి గౌడ్ లకు ఇవ్వాలి

 



సజ్జల రామకృష్ణారెడ్డి కి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి


State Politics News(Nellore):

 నెల్లూరు జిల్లా లో పెద్ద సంఖ్యలో ఉన్న గౌడ్ సామాజిక వర్గానికి నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కి విజ్ఞప్తి చేశారు. విజయవాడ లో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి ని ఆయన నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిశారు. కావలి మండలం జడ్పీటీసీ గా ఎన్నికైన జంపాని రాఘవులు గౌడ్ ను సజ్జల కు ఎమ్మెల్యే పరిచయం చేశారు. జంపాని రాఘవులు గౌడ్ సజ్జల కు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ లో సేవలు అందిస్తున్న జంపాని రాఘవులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ లో నియోజకవర్గ స్థాయి నాయకుడుగా పీసీసీ సభ్యుడు గా సుదీర్ఘ కాలం పాటు వ్యవహరించారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కి వివరించారు. రాజకీయాల్లో సీనియర్ అయిన జంపాని రాఘవులు గౌడ్
ఇదు సార్లు పంచాయతీ సర్పంచ్ గా, కావలి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడుగా, కావలి మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ గా అపారమైన సేవలు అందించారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కి వివరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ్ లకు సముచిత స్థానం కల్పించడం ద్వారా, ఆ సామాజిక వర్గం లో కురు వృద్ధులైన జంపాని రాఘవులు గౌడ్ కు నెల్లూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కి వారిని ప్రోత్సహించినట్లు గా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్నీ విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే కు చెప్పారు. ఎమ్మెల్యే తో కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, కావలి పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నాయకులు కోడూరు సాధక్ కుమార్ రెడ్డి, దామిశెట్టి సుధీర్ నాయుడు తదితరులు ఉన్నారు.