State Politics News(Nellore):
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా లో ఉంటూ పేద ప్రజలను ఇద్దరి నేతలు మోసాలకు పాల్పడినట్లు ముత్తుకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఈ విషయం పార్టీ దృష్టికి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పేరం నాగేశ్వరరావు గౌడ్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ కె బాబు లు దద్దోలు విజయ నిర్మల, మిరియాల వెంకట రమణ య్యల ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.తమ పార్టీ లో నిజాయితి పరులకే కొనసాగే అవకాశం ఉందని, మోసాలు చేసే వారు ఎంతటి వారినైనా ఉపేక్షించమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనకాడబోమన్నారు.