State Politics News (Nellore):
తప్పిపోయిన ఓ చిన్నారి ఆచూకీ కనుగొని గంటలోపే నవాబుపేట్ పోలీసులు తండ్రికి పాపను అప్పగించారు. వివరాల్లోకి వెళితే..నెల్లూరు నగరం ఎఫ్ సి ఐ కాలనీ కి చెందిన నాగినేని మాధవ్ తన 3 సం'' వయస్సు గల కుమార్తె నాగినేని హస్రి తప్పి పోయినట్లు నవాబ్ పేట్ పోలీసులుకు పిర్యాదు చేశారు.దీనితో నవాబుపేట సిఐ సుబ్బారావు తన సిబ్బంది బ్లూ కోల్ట్స్ , మహిళ పోలీసులు, వాలంటీరుల సహాయంతో వెతికించారు.అలాగే వాట్స్ అప్ , పేస్ బుక్ ,ఇతర సోషల్ మీడియా లలో తప్పిపోయిన పాప వివరాలు పొందుపరిచారు.అయితే గంట వ్యవధి లో వెతికి పట్టుకొని పాప తండ్రి కి అప్పగించడంతో పాప తండ్రి నవాబుపేట్ సిఐ కి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.