కొద్ధి నిమిషాలకే పాపని నానమ్మకు చేర్చిన నవాబుపేట్ పోలీసులు

 






State Politics News(Nellore):

నెల్లూరు నవాబుపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ పసిపాప  రోడ్డుపై స్టేట్ పాలిటిక్స్ ప్రతినిధికి తారసపడింది. ఎవ్వరు నీవు ఎక్కడ ఉంటారు అన్నను ఆ పాప నుండి సమాధానం రాలేదు.దానితో పాప చూపే ప్రాంతాలలో తిరిగి చివరకు నవాబుపేట్ పోలీసు స్టేషన్ లో ఆ పత్రిక ప్రతినిధులు అప్పగించారు. అయితే వెంటనే నవాబుపేట్ పోలీసులు స్పందించి పాప ఆచూకీ కోసం జిల్లా మొత్తం సెట్ లో అలెర్ట్ చేశారు.కొద్దీ నిమిషాలకే పాప బంధువుల ఆచూకీ తెలుసుకుని వారి నాన్నమ్మ మైలు రమణమ్మకి ,తాత చీరల లక్ష్మయ్య కు అప్పగించారు. అయితే పాపతో  కలిసి నెల్లూరు లోని నవాబుపేట్, గాండ్ల వీధిలో బంధువుల  పెళ్లికి వచ్చామని, తమది అనంతసాగరం మండలం నల్లరాజు పాలెం గ్రామం అని పోలీసులకు వారు తెలిపారు. ఇకనుండి జాగ్రత్తగా చిన్నపిల్లల పట్ల వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించి పంపారు.పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు జి మస్తాన్, యస్ కె లాలా,యన్ వినోద్ పాల్గొన్నారు.