State Politics News【Nellore】:
జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా 39 వ డివిజన్ లోని సోమవారం ఫత్తేఖాన్ పేట నందు రాష్ట్ర బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని,చెట్లు మానవ మనుగడకు ఎంతో అవసరమని రాజేంద్రప్రసాద్ అన్నారు.అందరం విధిగా మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నీలగిరి సంగం బీజేపీ మండల అధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి యాకసిరి ఫణిరాజు, కే నరేంద్ర ,మహిళా మోర్చా నాయకురాలు గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.