విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు

 


★కమిషనర్ గారు జర దృష్టి సారించరా.. సారు..!?



State Politics News【Nellore】:

 నెల్లూరు నగరంలో,శివారు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా కట్టేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పెడుతున్న అక్రమదారులు ,అధికారులు.

   ముఖ్యంగా 9,10,11,12,13,14,15,16 డివిజన్ల లో అక్రమ కట్టడాలతో ఇళ్ల నిర్మాణాలు,అపార్టుమెంట్లు ఊపందుకున్నాయి. అడిగే నాధుడు లేక పోవడం, వారి ఇష్టారాజ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ఖజానాకు గండి పడుతుంది. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లు,టౌన్ ప్లానింగ్ వారు పర్యవేక్షణ లు లేకపోవడంతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఇష్టారాజ్యంగా ప్లాన్ లు లేకుండా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆయా అధికారులు అడ్డుకట్టవేయకపోవడం గమనార్హం.దీనితో కార్పొరేషన్ ఖజానాకు చేరాల్సిన నిధులు అక్రమ మార్గంలో కొందరి చేతులు తడుస్తున్నాయ్.కార్పొరేషన్ అధికారులు అలసత్వం ఉండడం వలన నగరాభివృద్ది కి భాగంగా ఖాజానా కి రావాల్సిన నిధులు కూడా జమ కాకా పోవడంతో కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి వేతనాలు కొరత కూడా ఏర్పడుతుంది.
ఇకనైనా అధికారులు మేల్కొని కార్పొరేషన్ ఖజానాకు గండి పడకుండా ప్లాన్ లేకుండా కట్టే కట్టడాలపై కొరడా ఝుళిపించి కార్పొరేషన్ అభివృద్ధి, సిబ్బంది జీతాలు కొరత లేకుండా అధికారులు చేయాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందని చెప్పవచ్చును.