జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు దాసరి ప్రసాద్ కి సన్మానం

 



    

State Politics News【Nellore】:

  విడవలూరు  మండలంలోని   రామతీర్థం గ్రామానికి చెందిన  దాసరి ప్రసాద్ భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు అలంకరించి చిన్న వయసులోనే భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా   లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు  విడవలూరు మండలం వావిళ్ళ గ్రామానికి చెందిన ఆయన మిత్రులు ఆదివారం ఘనంగా సన్మానించారు.   చిన్న వయసు లో ఏబీవీపీ  విద్యార్థి నాయకుడిగా  , భారతీయ జనతా పార్టీ యువజన నాయకుడు గా   అనేక   పదవులు ఆయన నిర్వహించారు. అపుడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని ఆయన మిత్రులు కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో  వావిళ్ళ గ్రామ యూత్   కుమార్ రాజా,  బాలకృష్ణ, మురళి, శ్రీధర్, రామ్మోహన్, రాజా తదితరులు పాల్గొన్నారు.