ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తాం:ఎమ్మెల్యే కాకాని



 State Politics News【Nellore】:

 టిపిగూడూరు మండలం, పాపిరెడ్డిపాళెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలైన నూతనంగా నిర్మించిన సిమెంటురోడ్లు, సైడ్ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకును సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.


         ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పాపిరెడ్డి పాళెం గ్రామానికి 2 సంవత్సరాల కాల వ్యవధిలో 1 కోటి యాభై లక్షల రూపాయలను పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసి, ప్రారంభించి, పూర్తి చేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నేపథ్యంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, ప్రజానీకానికి పూర్తిస్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.గ్రామ ప్రజానీకానికి అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లు, తాగునీటి పథకాలు దాదాపుగా పూర్తి చేయడం జరిగిందన్నారు.గ్రామాల్లో పర్యటిస్తే, గ్రామ సమస్యలపై ఒక్క అర్జీ కూడా ఇవ్వవల్సిన అవసరం రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా నిధులు లేక చేపట్టలేకపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల కోరిక మేరకు దాదాపుగా పూర్తి చేశామని ఎమ్మెల్యే కాకాని అన్నారు. నియోజకవర్గానికి సంబందించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, పేడూరు సొసైటీ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు తిరువల్లూరు ఈశ్వరయ్య, దగ్గు భార్గవి,చిరంజీవి గౌడ్ సోదరులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.