State Politics News【Nellore】:
కులమతాలకు అతీతంగా జగన్ అన్న కాలనీ లో ఇళ్లను రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అనిల్ అన్న ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు భూమిపూజ నిర్వహించారు.స్థానిక వెంకటేశ్వర పురం,ఇనమడుగు ,పడుగుపాడు లలో శనివారం లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల్లో భూమి పూజ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ వైసీపీ ఇంచార్జి మద్దినేని శ్రీధర్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రాంతం ఒక పండుగ వాతావరణం తలపిస్తోందని సీఎం జగనన్నకు, మంత్రి అనిల్ అన్నకు,రాష్ట్ర నాయకులు ద్వారకన్నకు లబ్ధిదారుల తరుపున కృతజ్ఞతలు తెలిపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నేతలు, కార్యకర్తలు, వలంటీరులు తదితరులు పాల్గొన్నారు.